logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

11ఏళ్ళ బాలిక ను గర్భవతి చేసిన కామాంధునికి 60 ఏళ్ళు జైలు శిక్ష

*11 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన కామాంధునికి 60 ఏళ్లు జైలు శిక్ష.*

నల్గొండ డిసెంబర్ 23:పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తికి నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి, 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

నల్గొండ శివార్లలో ఉంటున్న బాలికకు నిజాముద్దీన్ అనే 36 ఏళ్ల వ్యక్తి మాయ మాటలుచెప్పి అత్యా చారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భవతి అయింది.

బాధిత బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు నిందితుడు నిజాముద్దీన్ పై పోక్సోతో పాటు పలు కేసులు పెట్టారు.

ఈ కేసులో శుక్రవారం న్యాయమూర్తి తీర్పు చెబుతూ పోక్సోతోపాటు మరో రెండు సెక్షన్ల కింద మూడు వేర్వేరు నేరాలకు సంబంధించి ఒక్కొక్క నేరానికి 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

అయితే ఈ మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు బాలికకు 10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు ఇది కాకుండా నేరస్థుడికి 60 వేల రూపాయల జరిమానా విధించారు.

167
7293 views

Comment