Machilipatnam, Krishna District, Andhra Pradesh, India.
*తుఫాన్లో విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరు భేష్*--- *పేర్ని వెంకటరామయ్య (నాని) ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు.*--- *సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పేర్ని నాని వ్యాఖ్యలు**మచిలీపట్నం* :*మిచోంగ్ తుఫాను సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పనితీరు భేషుగ్గా ఉందని ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) కొనియాడారు. తుఫాను సమయంలో విద్యుత్ శాఖ ఈ ఈ మన్నెం భాస్కర్ రావు సారధ్యంలోని విద్యుత్ ఉద్యోగులు చేసిన విధులను ప్రశంసిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తుఫాన్ సమయంలో అన్ని శాఖల అధికారులు పనిచేయడం ఒక ఎత్తు అయితే విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయమని, విపత్తు సమయంలో విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు, సిబ్బంది ప్రజలకు అండగా నిలవడం గొప్ప విషయమని పేర్ని నాని కొనియాడారు. పేర్ని నాని వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో నేటిజెన్లు మద్దతు ఇస్తున్నారు. తుఫాను సమయంలో మూడు రోజులపాటు అర్ధరాత్రి వేళలో నిద్ర లేకుండా గాలివానకు తడుస్తూ విద్యుత్ అసౌకర్యం కలగకుండా వారు చేసిన సేవలు అభినందనీయమని నెటిజన్లు విద్యుత్ ఈ ఈ భాస్కరరావు తో పాటు ఇతర విద్యుత్ సిబ్బందికి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు*