logo

*జనగామలో గెలిచిన కేసీఆర్... ఓడిన స్థానిక ప్రజలు...* *గెలిచిన తెలంగాణ ... ఓడిన జనగామ...* *ఊరంతా ఓ దారి ఉలిపికట్టెది మరోదారి...*

*జనగామలో గెలిచిన కేసీఆర్... ఓడిన స్థానిక ప్రజలు...*
*గెలిచిన తెలంగాణ ... ఓడిన జనగామ...*
*ఊరంతా ఓ దారి ఉలిపికట్టెది మరోదారి...*

మన మాజీ సీఎం కెసిఆర్ చెప్పినట్టుగా కుక్కతోకను పట్టుకొని గోదారి ఈదినట్టే ఉంది జనగామ జిల్లా పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రమంతా మేల్కొంది కానీ జనగామ ఓటర్లలో రాజకీయ చైతన్యం ఇంకా రాలేదు అనడానికి జనగామ బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపు ప్రత్యక్ష నిదర్శనం. ఒకరు ముఖ్యమంత్రి అయితే మరొకరు ముఖ్యమంత్రి అభ్యర్థి.. ఒకే రాష్ట్రమైనప్పటికీ.. ఎక్కడినుంచో తమ ప్రాంతానికి వచ్చి పోటీ చేసిన మాజీ సీఎం కెసిఆర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి లను ఓడించి తమ సొంత బిడ్డ అయిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించుకున్న కామారెడ్డి ప్రజలకున్న చైతన్యంలో జనగామ ఓటర్లలో ఇసుమంతైనా లేకపోవడం బాధాకరం. అదీ స్వాతంత్ర్యం అంటే.. జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పోటీ చేసిన మూడుసార్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా స్థానికుడికి టికెట్ కేటాయించకుండా ( జనగామ ప్రజల నాడీ తెలిసి) అహంకారంతో స్థానికేతరుడికి టికెట్ ఇచ్చి జనగామ ప్రజలను, వారి అస్తిత్వాన్ని అవమానించినా మనకు మాత్రం జ్ఞానోదయం కాదు. స్థానిక నాయకుడు, గతం లో ఎమ్మెల్యేగా ఎన్నికై, స్థానిక సమస్యలపై అనుభవం కలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి గారిని ఓడించి తాము కూడా ఓడిపోయారు జనగామ స్థానిక ఓటర్లు. మూడుసార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక జనగామలో ఒకసారి కూడా స్థానిక వ్యక్తికి టికెట్ కేటాయించకపోవడంతోనే అర్ధమైంది జనగామలో రాజకీయ చైతన్యం లేదని. ఇన్నేళ్లనుండి రాజకీయం చేస్తున్నా, ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నా... టిక్కెట్టు తెచ్చుకునే తెలివిలేని బానిస బతుకు బతుకుతున్న స్థానిక టిఆర్ఎస్ నాయకులు డబ్బులకు అమ్ముడుపోతూ వారి కార్యకర్తలను కూడా కట్టు బానిసలుగా చేస్తూ పరాన్నబుక్కులుగా జీవితం గడుపుతూ వచ్చారు. సొంత జిల్లాలో (నల్గొండ) పసలేని పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ జిల్లాలో పట్టం కట్టి తమ స్వామి భక్తిని మాత్రం చాటుకుని స్థానిక ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. ఇంతటి రాజకీయ అపరిపక్వత భవిష్యత్తు స్థానిక రాజకీయాలకు గొడ్డలిపెట్టు .. ఇంతటి అజ్ఞానంతో పల్లాకు పట్టం కట్టిన జనగామ ఓటర్లు ఇంకా మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలంగాణకు విముక్తి లభించింది కానీ జనగామ జిల్లాకు ఇంకా విముక్తి లభించలేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. అస్తిత్వాన్ని మరిచిపోయి అజ్ఞానాన్ని కూడా అత్యున్నత జ్ఞానం అని ప్రజలను భ్రమింపజేసి తమకు తామే మురిసిపోయే అధమనాయకులకు వారి స్వార్ధ ప్రయోజనాలు తప్ప స్థానిక ప్రజల ప్రయోజనాలు ఎలా కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి... గెలిచిన పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా మొక్కవోని విశ్వాసంతో, ఆత్మాభిమానంతో, అవమానాలను మునిపంటి బిగువన భరించి నిలిచి గెలిచిన అభినవ సైనికులు కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్ప మిగిలిన వాళ్లందరూ పరాయివాళ్లుగా భావించినా... అసలైన తెలంగాణ వాదులుగా రంగంలోకి దూకి తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న నిజమైన కార్యకర్తలు. తెలంగాణ ఇస్తే చస్తామని తెలిసి చాతక పక్షిలా ఎదురుచూసిన నిజమైన ధీరులు కాంగ్రెస్ నాయకులు. . అధికారం చేతిలో లేకున్నా ఆత్మవిశ్వాసంతో అడుగడుగునా భుజం భుజం కలిపి నిలిచి గెలిచిన ధీరుల్లా కనిపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. పార్టీకి పదవులు అనుభవించే లీడర్లు కాదు కార్యకర్తలే నిజమైన బలమని నిరూపించారు వారు. మారింది లీడర్లు కానీ ... తాము కాదని రుజువు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. వారికి ప్రత్యేక అభినందనలు. *నేటి ఈ ఫలితాలు కాంగ్రెస్ సహనానికి -బిఆర్ఎస్ అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికలుగా నేను అభివర్ణిస్తున్నాను.* చైతన్యం లేని సమాజం ఎన్నటికీ మనుగడ సాధించలేదు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోలేని అచేతనమైనటువంటి సమాజం ప్రగతి పదంలో ఎన్నటికీ పయనించలేదు. జ్ఞానానికి చోటు లేని ఏ ప్రాంతము వెలుగులకు నోచుకోలేదు.
*వీరుడిగా కథనరంగంలోకి దూకి కాంగ్రెస్ నీ గెలిపించే బాధ్యతలను భుజానికి ఎత్తుకొని విజయతీరాలకు చేర్చిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆనవాళ్లు లేకున్నప్పటికీ ఖమ్మంలో, నల్గొండలో కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ నిలిచి గెలిచిన భట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే ఎన్ని ప్రలోభాలు పెట్టిన, అవమానాలకు గురైనా తాము మాత్రం మనో నిబ్బరం కోల్పోకుండా నిలబడిన ప్రతి కాంగ్రెస్ లీడర్లకు, కార్యకర్తలకు, ఈ గెలుపు అంకితం. రాబోయే ఐదేళ్లలో ప్రజా రంజక పాలన అందించి నిస్వార్ధంగా రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొని తెలంగాణ ప్రజల మనసులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా అధికారం కోసం అర్రులు చాస్తూ.. డబ్బు కోసం పూటకో పార్టీ మారుస్తూ ..ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తిష్ట వేసి మేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించే నకిలీ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండి అసలైన ఆత్మాభిమానం గల నాయకులను అక్కున చేర్చుకుని, కార్యకర్తలను రక్షించుకుంటూ, వారి మనోభావాలను గౌరవిస్తూ ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలంగాణ కాంగ్రెస్.

16
6221 views