Telangana state 2013 election campaign
ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం= రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ గారు ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు అన్నారు. బుధవారం గోదావరిఖని మార్కండేయ కాలనీ బృందవన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.... కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనందిస్తున్నారన్నరుమైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసారని, వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనార్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ముస్లిం మైనారిటీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.దేశంలోనే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎకైక సిఎం కేసీఆర్ గారు = రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ గారు దేశంలోనే ముస్లిం మైనారిటీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ గారు అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కండేయ కాలనీ బృందావన్ గార్డెన్స్ లో ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గారితో పాటుగా నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుగారు బీ.ఆర్. ఎస్ పార్టీ రామగుండం ఎన్నికల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి గారు మూల విజయ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... గత ప్రభుత్వాలన్నీ ముస్లిం మైనార్టీలను ఎన్నికల సందర్భంలో ఓట్లుగానే చూశానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు ముస్లిం సంక్షేమానికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. పేద ముస్లిం ఇంట్లో పెళ్లయితే షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం అన్నారు. పేద ముస్లిం విద్యార్థులు ఉన్నతంవా చదువు కోవాలని ముస్లిం ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి మీద ఒక లక్షా 25 వేలు ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింలను ఏనాడు పట్టించుకోలేదని చెప్పారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తమను గెలిపుంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పోరేషన్ కో ఆప్షన్ సభ్యులు తస్నీంభాను రఫిక్ బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పి టి స్వామి జహిద్ పాషా గౌస్ పాషా సలీం హమీద్ ముస్లిం నాయకులు జలీలోద్దిన్ జమీల్ నసీమ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. గంగనగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రఫీ రహిం మీర్జా ఫయాజ్ బాబా టిప్పు సుల్తాన్ సద్దాం హుస్సేన్ మెహబుబ్ చాంద్ మణి బీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. వారని ఎమ్మెల్యే గారు గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.