logo

*గాంధీ ఆశించిన సమాజం కోసం ఆమ్ ఆద్మీ కృషి : జిల్లా కన్వీనర్ దయానంద్*


సత్యం, అహింసే ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపిన గాంధీ ఆశించిన సమాజం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.దయానంద్ అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వెన్ లాక్ గ్రంథాలయం వద్ద నున్న గాంధీ విగ్రహానికి రాష్ట్ర ట్రెజరర్ సీర రమేష్ కుమార్ తో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చీపుర్లతో రోడ్లను శుభ్రం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రం చేసేందుకు చీపురు పట్టాలని గాంధీ పిలుపునిచ్చారని, ఆయన స్ఫూర్తితో దేశంలో అవినీతిని ఊడ్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చీపురు పట్టారని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ లో వచ్చిన రాజకీయ మార్పు దేశావ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉందని అందుకు ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బూరాడ శ్రీనివాస్, రాజాం నియోజకవర్గం కన్వీనర్ పైల రమేష్ రాజు, విజయనగరం కన్వీనర్ తిప్పాన కోటేశ్వరరావు, యువజన నాయకులు నయీమ్, ప్రవీణ్, కిలాని శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

3
3094 views
  
1 shares