logo

జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవం లో వివక్ష చూపకుండా అన్ని సబ్జెక్టులకు సమన్యాయం పాటించాలి.

జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవం లో వివక్ష చూపకుండా అన్ని సబ్జెక్టులకు సమన్యాయం పాటించాలి.


ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్...



ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవం లో వివక్ష చూపకుండా అన్ని సబ్జెక్టులకు సమన్యాయం పాటించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ కోరారు. 2022 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ల ప్రదానోత్సవం లో తెలుగు హిందీ ఉర్దూ భాషల స్కూల్ అసిస్టెంట్ లకు, భాషా పండితుల కు ఎవరికి కూడా అవకాశం కల్పించ బడలేదని, ఈ‌ సంవత్సరం-05-సెఫ్టెంబర్-2023 న అయిన భాషాపండితులకు, భాషల స్కూల్ అసిస్టెంట్ లకు ఎక్కువ సంఖ్యలో అవకాశం కల్పించాలని, భాషా పండితులు సంవత్సరాల తరబడి నుండి సమానపనికి సమాన వేతనం సమాన గౌరవం లభించక శ్రమ దోపిడి వెట్టిచాకిరి కి గురౌతూ ఆత్మ గౌరవం చంపుకొని పని చేస్తున్నారని, వీరికి కనీసం రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ల ప్రదానోత్సవం లోనైనా సమాన అవకాశాలు కల్పించి సమ న్యాయం పాటించాలని, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న తెలుగు భాషా పండితులను ఎఫ్.ఎల్. ఎన్ నుండి మినహాయింపు కల్పించి ఉన్నతి కార్యక్రమానికి మాత్రమే బాధ్యులను చేయాలని, యస్.జి.టీ లకు కేవలం ఎఫ్.ఎల్ ఎన్ కు బాధ్యులను చేయడం, స్కూల్ అసిస్టెంట్ లను కేవలం ఉన్నతి కే పరిమితం చేయడం జరుగుతుందని, కాని భాషా పండితుల ను ఎఫ్.ఎల్.ఎన్, ఉన్నతి రెండు కార్యక్రమాలకు బాధ్యులను చేయడం వివక్ష అవుతుందని అన్నారు. ఇట్టి సమస్యల పరిష్కారానికై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు మేయిల్ వినతి పంపినట్లు ఆయన తెలిపారు.

91
9066 views