logo

ఈ ఫోటో చూస్తుంటే మనస్సు చలించి పోయింది 😢😢     ప్రతి తండ్రీ తన పిల్ల లకు ఒక మంచి సంభందం కావాలి అని ఆశ పడ

ఈ ఫోటో చూస్తుంటే మనస్సు చలించి పోయింది 😢😢

    ప్రతి తండ్రీ తన పిల్ల లకు ఒక మంచి సంభందం కావాలి అని ఆశ పడి ... మంచి సంబంధం దొరికితే ఎలాగోలా అప్పు చేసి ఐనా వారడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకొంటాడు .... ✍️✍️✍️
  
అదే సమయానికి కట్నం అందక పోతే ఆ కుటుంభమ్ పడిన వేదన కు ప్రతిరూపం ఈ ఫోటో 😢😢😢😢

వరకట్నం అనేది ఎంత ప్రమాదం అనేది మనకు అర్థం అవుతుంది. పేద కుటుంబ లు చాలా ఇలానే ఇబ్బందులు పడుతున్నారు. రాజ్యాంగం లో రాసింది వరకట్నం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం అని కానీ ప్రభుత్వ లు గాలికి వదిలేశారు.🙏🙏🙏

ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో  విషాదం . పెళ్లి జరగాల్సిన ఇంట్లో  ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీ ,ఇద్దరు కూతుర్లు బలవన్మరణం...నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో నివసించే కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కష్టపడి జీవించే కుటుంబంలో కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది.జనవరి 11 న వివాహం .తండ్రి బంగారు షాపులో పని చేస్తాడు ,తల్లి కూతుళ్ళు టైలారింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.🚶🚶🚶

 అయితే వివాహం దగ్గర పడటం ,డబ్బులు లేకపోవడంతో భాదతో  రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి తల్లి గోవిందమ్మ (49)రాధిక(29),రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి🚶🚶🚶

పోలీస్ లు  కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
సుబ్బారావు గాలంకి✍️✍️✍️

ప్రతి జీవితంలో ఎన్నో పోరాటాలు 🔥🔥🔥

1
14714 views