logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బస్ స్టాండ్ సెంటర్ లాంటి రద్దీ ప్రదేశంలో చేపల అమ్మకాలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న

స్థానిక బస్ స్టాండ్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే చేపల అమ్మకాలు సాగిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ కూడలిలో చేపల దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోందని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చేపల వ్యర్థాలను రోడ్డు పక్కనే పారేస్తుండటంతో ఈ ప్రాంతమంతా ఈగలు, దోమలకు నిలయంగా మారింది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దుకాణాల వద్ద వాహనాలను నిలపడం వల్ల బస్ స్టాండ్ సెంటర్‌లో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, ఈ చేపల అమ్మకాలను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని, ప్రజల ఆరోగ్యానికి, రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

6
4110 views

Comment