వైభవంగా శ్రీ మరిడి మాంబ మొదటి వార్షికోత్సవం...
తల్లిని దర్శించుకున్న సిరమ్మ
భీమిలి నియోజకవర్గం ,జూన్ 05 :
భీమిలి నియోజకవర్గం లోని, భీమిలి జోన్ జీవీఎంసీ 2వ వార్డు స్థానిక కర్రినమ్మి వానిపేటలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ తల్లి మొదటి వార్షికోత్సవం శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. వైసీపీ నాయకులు నమ్మి మాధవరావు ఆహ్వానం మేరకు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ అమ్మవారిని దర్శించు కున్నారు. గ్రామస్తులు, భక్తుల కోలాహలం మధ్య ఆలయానికి చేరుకున్న వీరు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి గీతాలతో, అమ్మవారి నామస్మరణతో మారుమోగింది.
శ్రీ శ్రీ శ్రీ మరిడి మాంబ తల్లి గ్రామ దేవత పండుగను కళ్లారా వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అనంతరం ఉత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన అన్నా ప్రసాదం కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో
మాజీ కార్పొరేటర్ అక్కరమాని రాము నాయుడు, జీవీఎంసీ 2వ వార్డ్ అధ్యక్షులు చిల్ల భాస్కర్ రెడ్డి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి జీరు వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు శీలా కరుణాకర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్,బూత్ అధ్యక్షుడు శీలా వంశీ, పీతల వెంకట అప్పారావు, నమ్మి శ్రీరామ్,నమ్మి సింహాచలం
లతో పాటు చిన్న శీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.