యోగాంధ్ర కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం పరిధిలో జూన్ 8వ తేదీన గంగాధర మండపం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం
*దేవస్థానం పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాలు*
• యోగాంధ్ర కార్యక్రమములో భాగంగా దేవస్థానం పరిధిలో యోగా కార్యక్రమాల నిర్వహణ
• ముందస్తుగా జూన్ 6,7 తేదీలలో యోగా శిక్షణా కార్యక్రమాలు
• జూన్ 8వ తేదీన గంగాధరమండపం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం
• జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగాదినోత్సవం నిర్వహణ
రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమములో భాగంగా జూన్ 8వ తేదీన భారీస్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
యోగా కార్యక్రమానికి ముందస్తుగా జూన్ 6 మరియు 7వ తేదీలలో చంద్రవతి కల్యాణ మండపంలో యోగాశిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయస్థాయిలో పేరొందిన యోగా గురువులచేత ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు.
ఇప్పటికే ఈ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టబడుతున్నాయన్నారు.
జూన్ 8 వ తేదీన నిర్వహించునున్న ప్రత్యేక యోగా కార్యక్రమానికి గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు యోగానిర్వహణకు ఆయా ఏర్పాట్లు చేయబడుతున్నాయన్నారు. జూన్ 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని కూడా గంగాధరమండపం వద్దనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
స్థానికులు మరియు యాత్రికులు ఈయోగా కార్యక్రమములో పాల్గొని ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.