ఘనంగా పర్యావరణ దినోత్సవం. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్, ఎమ్మెల్యే.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిల ప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాబోయే తరాల కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. "ప్రతి ఇంట ఒక మొక్క.. ప్రతి మనిషికి పర్యావరణ బాధ్యత" అనే నినాదంతో ఆళ్లగడ్డను పచ్చని నియోజకవర్గంగా మారుద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.