logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారం

సోమందేపల్లి, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమందేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ వద్ద శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్‌కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటేష్, పార్లమెంట్ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్, టౌన్ అధ్యక్షుడు వడ్డే సూరి, మాజీ మండల కన్వీనర్ సిద్దలింగప్ప, మాజీ ఎంపీటీసీ కృష్ణప్ప, డీఆర్ సోము, పి. ప్రకాష్, పంచాయతీ సిబ్బంది డి.వి. ఆనంద్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

47
1202 views

Comment