logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లావ్యాప్తంగా మొదలైన ఉపాధ్యాయుల శిక్షణ

జిల్లావ్యాప్తంగా మొదలైన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయులకు జ్ఞాన ప్రకాష్ ఇయర్ 3 F L N శిక్షణ కార్యక్రమం అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం ఉరవకొండ గుత్తి తాడిపత్రి లో మొత్తం 7 సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహిస్తుంది

ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రాథమిక దశలోని పిల్లల అభ్యసన అభివృద్ధికి తోడ్పడేటువంటి విషయాలను జిల్లా రిసోర్స్ పర్సన్ లు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.ఇందులో భాగంగా కొర్రపాడు రీజినల్ ట్రైనింగ్ సెంటర్ నందు ప్రారంభ సమావేశానికి అనంతపూర్ ఇన్చార్జి డిఈఓ శ్రీ శ్రీనివాస్ రావు గారు హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం వచ్చిన ఆధునిక సాంకేతికతను జోడించి ఎలా విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి తోడ్పడాలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అదేవిధంగా పునాది స్థాయిలో పిల్లల అభ్యసన అభివృద్ధికి ఈ శిక్షణ ఎంతో తోడ్పడుతుందని జిల్లా స్థాయిలో జిల్లా రిసోర్స్ పర్సన్లు అత్యుత్తమ శిక్షణ తీసుకొని ఉపాధ్యాయులకు బోధనకు అవసరమైనటువంటి మెలకువలు నేర్పించబోతున్నారని ఉపాధ్యాయులందరూ శ్రద్ధగా విశిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు
అనంతపురంలో మరో ట్రైనింగ్ సెంటర్

ఉపాధ్యాయులకు సౌకర్యంగా ఉండేందుకు వారు కోరుకున్నచోట శిక్షణను ఇవ్వడానికి రాష్ట్ర అధికారుల నిర్ణయం మేరకు అనంతపురంలో రేపటి నుంచి మరొక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సమగ్ర శిక్ష ఏయంబు శ్రీ పి వేణుగోపాల్ తెలియజేశారు బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురుగా ఉన్న విజయభారతి బీఈడీ కాలేజీలో రేపటి నుంచి కొత్తగా మరొక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆన్లైన్ లింక్ ద్వారా అనంతపురం సెంటర్ ని ఎంచుకున్న వారు మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని తెలియజేశారు

అలాగే జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాల నుంచి కూడా కొంతమంది ఉపాధ్యాయులు మరొక శిక్షణా కేంద్రాన్నీ ఎంపిక చేసుకున్నారని వారి కోరిక మేరకు రేపటి నుంచి ఆన్లైన్ లింకులో కోరుకున్నటువంటి శిక్షణ కేంద్రంలో హాజరు కావాలని తెలియజేశారు

కొర్రపాడు రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఏపీ మోడల్ స్కూల్ రాప్తాడు లో శిక్షణ పొందుతున్న వారు రేపటి నుంచి కూడా అదే కేంద్రంలో శిక్షణ తీసుకుంటారని తెలియజేశారు

0
0 views

Comment