logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నర్సీపట్నంలో సనా స్పీచ్ సెంటర్లో నాగూర్ సహిద్కు ఘన జన్మదిన వేడుకలు

అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ‘సనా స్పీచ్, హియరింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్’లో నాగూర్ సహిద్‌కి నిర్వహించిన జన్మదినోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. సెంటర్ నిర్వాహకులు, ప్రసిద్ధ ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ ఎన్. మస్తాన్వలి, రాజేశ్వరి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
హ్యాపీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్, నాతవరం ఎస్టీ సెల్ అధ్యక్షులు మెల్లిక చంటి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి నాగూర్ సహిద్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్ర‌మానికి పెద్ద సంఖ్యలో పిల్లలు, శ్రేయోభిలాషులు మరియు స్థానికులు హాజరయ్యారు.
డాక్టర్ ఎన్. మస్తాన్వలి మాట్లాడుతూ, "పేదలకు, అనాధలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అనకాపల్లిలో మా ప్రధాన శాఖను ప్రారంభించాము. కొద్ది కాలంలోనే చుట్టుపక్కల గ్రామాల ప్రజల నమ్మకం గెలిచాం. నర్సీపట్నంలోని నూతన శాఖ కూడా కొన్ని నెలల్లోనే స్థానికుల మన్ననలు పొందిందీ. అనేకమంది మా సేవల ద్వారా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు" అన్నారు.
సేంట్‌ర్ హియరింగ్ ఎయిడ్స్, స్పీచ్ థెరపీ మరియు రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్లను ఆధునిక సాంకేతికతతో, అందుబాటులోని ధరల్లో అందిస్తున్నదన్నారు. ఇదే కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సనా ఒక విశిష్ట గుర్తింపును సంపాదించిందని ఆయన వివరించారు.
ముఖ్య అతిథి డాక్టర్ చంద్రశేఖర్ సెంటర్‌లోని చికిత్సా విధానాలు, తాజా పరికరాలు పరిశీలించి నిర్వాహకులను ప్రశంసించారు. ఇలాంటి స్పెషలైజ్డ్ సెంటర్లు అనకాపల్లి జిల్లాలో అరుదుగా ఉన్నాయని, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఈ సెంటర్ ఒక పెద్ద వరం అని పేర్కొన్నారు. మస్తాన్వలి మాట్లాడుతూ తాము పేదవారి, అనాధ పిల్లల కోసం సహాయం చేసే విషయానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో విచ్చేసిన ప్రముఖులు పెద్దలు మరియు స్థానికులు ఈ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్‌లో మరింత విస్తరణ, ఫ్రీ క్యాంప్‌లు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

0
46 views

Comment