MLA CLEAND GARBAGE WITH HANDLING WITH BROOM
చీపురు పట్టిన ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో స్వచ్ఛ పథం
గ్రామంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంగా మార్చాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం అవనిగడ్డలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ధ స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గారు స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చి తొలగించారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది పిచ్చి మొక్కలు, చెత్త చెదారం తొలగించారు. ఆవరణలో కంపలో మరుగున పడి ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని ఎమ్మెల్యే గారు గమనించి పిచ్చి మొక్కలు తొలగింపచేసి కృష్ణ మందిరాన్ని శుభ్రం చేయించారు. ప్రభుత్వ కార్యాలయాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛతపై దృష్టి పెట్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛత సాధనకు సహకరించాలని కోరారు. స్వచ్ఛమైన వాతావరణంతోనే ప్రజారోగ్యం సాధ్యం అన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి తహసీల్దార్ శ్రీనివాస్ గారు, పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు గారు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.