logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కిషోరి బాలికలకు స్మార్ట్ఫోన్ వినియోగంపై అవగాహన

సోమందేపల్లి, జూన్ 2: సోమందేపల్లి మండలంలోని సోమందేపల్లి-2, సోమందేపల్లి ఎస్సీ మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని కిషోరి బాలికలకు మంగళవారం స్మార్ట్‌ఫోన్ వినియోగం, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సీడీపీఓ డాక్టర్ శాంతలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ శుభారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కిషోరి వికాసం సమ్మర్ సెషన్‌లో బాలికలకు ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నందున అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.
ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, పాఠశాల వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎవరితోనూ పంచుకోకూడదని, పాస్‌వర్డ్‌లను గోప్యంగా ఉంచి తరచూ మార్చుకోవాలని తెలిపారు. సోషల్ మీడియా గోప్యతా సెట్టింగ్‌లను వినియోగించి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాలని సూచించారు.
అలాగే అసభ్య పదజాలాన్ని ఉపయోగించకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ డాక్టర్ శాంతలక్ష్మి, సూపర్వైజర్ శుభారాణి, అంగన్‌వాడీ వర్కర్లు రామాంజనమ్మ, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కిషోరి బాలికలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

39
1427 views

Comment