logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Jun 02, 2026,
జర్నలిస్టు మాకోటి మహేష్

ఆంధ్రప్రదేశ్ : ఏలూరు జిల్లా, వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో వలగాని సావిత్రి ఇల్లు, పక్కనే ఉన్న లక్ష్మి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సావిత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన ఆమె అక్క సిగ పూలమ్మ ఇద్దరూ నిద్రలోనే సజీవదహనమయ్యారు. లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

0
57 views

Comment