సచివాలయ ఉద్యోగులకు కీలక అప్డేట్
5,374 మంది మిగులు సిబ్బందికి డిప్యూటేషన్ పోస్టింగ్లు
అమరావతి, జూన్ 2 (AIMA MEDIA ): రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మిగులు సిబ్బందిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,374 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల్లో డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అవసరాల మేరకు ఆయా శాఖల్లో ఉద్యోగులను కేటాయించనున్నట్లు తెలిపింది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
📰 AIMA MEDIA
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010