ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేసిన 16వ డివిజన్ ఇన్చార్జ్ ఏటూరు రామచంద్రారెడ్డి
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేసిన 16వ డివిజన్ ఇన్చార్జ్ ఏటూరు రామచంద్రారెడ్డి
కడప, జూన్ 1: కడప నగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 16వ డివిజన్ ఇన్చార్జ్ ఏటూరు రామచంద్రారెడ్డి, కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్యరెడ్డి, కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, కొన్నేవారిపల్లి, నాయనవారిపల్లి, పెద్ద ముసలిరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఏటూరు రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పింఛన్ అందుకుంటున్న వృద్ధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే డివిజన్ పరిధిలోని కాలనీలు, గ్రామాల్లో ఉన్న పలు ప్రజా సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.