logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Manyam dist AP collector visits rural area

🤝🌾 వెంగాపురం గ్రామస్థులతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ... వారి యోగక్షేమాలు,సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు 🌾🤝

📍 వెంగాపురం, బలిజిపేట మండలం | జూన్ 01
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఎన్.టి.ఆర్ భరోసా” పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో లబ్ధిదారుల గృహాల వద్దకే వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

🔹 లబ్ధిదారుల గృహాల వద్దకే వెళ్లి పింఛన్ అందజేశారు
🔹 గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు
🔹 ప్రజలు వివరించిన సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
🔹 వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు
🔹 ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ:

🔹 ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు
🔹 సామాజిక భద్రతా పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు
🔹 ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు
🔹 గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు

🌟 కలెక్టర్ గారు స్వయంగా గ్రామంలోకి వచ్చి పింఛన్ అందజేస్తూ ప్రజలతో మాట్లాడడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యలను నేరుగా వివరించే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

📢 ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన సాధ్యమవుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.

#ParvathipuramManyam #NTRBharosa
#SocialSecurity #GoodGovernance
#Parvathipuram #salur #Palakonda #Kurupam
#prabhakarareddynakkala @prabhakarareddy
#trending #pensions #welfare #publicservice

1
4385 views

Comment