BOBBILI(AP) MLA INAGRATED DRINKING WATER PROJECT
UIDF (Urban Infrastructure Development Fund) నిధులు రూ123.9 కోట్లతో బొబ్బిలి పట్టణానికి త్రాగునీటి ప్రాజెక్టు.
- ఈ ప్రాజెక్ట్ కింద పట్టణ పరిధిలో 4 కొత్త రిజర్వాయర్లను నిర్మించి ఇంటింటికీ నీటి సరఫరా చేయనున్నారు.
- సువర్ణముఖి నది నుంచి సుమారు 16 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మాణం.
బొబ్బిలి నియోజకవర్గంలో, బొబ్బిలి పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, UIDF(Urban Infrastructure Development Fund) నిధులు 123.9 కోట్ల మంజూరు చేయించడం జరిగింది.. ఈరోజు ఉదయం స్వామివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక రిజర్వాయర్ నిర్మాణానికి భూమిపూజ చేశాము.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజల త్రాగునీటి కష్టాలు తీరనున్నాయి..2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు, ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలేదు. *వైసీపీ ప్రభుత్వం హయాములో ఎటువంటి పురోగతి నోచుకొని కారణంగా, బొబ్బిలి ప్రజల త్రాగునీటి కష్టాలకు నేటికీ పరిష్కారం లభించలేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, నేను ఎమ్మెల్యే అయ్యాక గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ *పొంగూరు నారాయణ* గారుకి పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను గురించి వివరించి, ఈ ప్రాజెక్టు గురించి తెలుపగా వారి చొరవతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మళ్లీ పునఃప్రారంభించడం జరిగింది. *రూ123.9 కోట్లతో* చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కింద, సువర్ణముఖీ నది నుంచి 16 కిలోమీటర్ల పైపులైను ద్వారా, నూతనంగా నిర్మించనున్న నాలుగు రిజర్వాయిర్లకు మరియు ఇప్పుడు ఉన్న రెండు రిజర్వాయిర్లకు నీటిని తరలించి, 90 కిలోమీటర్ల నూతన పైపులైను ద్వారా సుమారు 7500 హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కు త్రాగునీటి సరఫరా చేయనున్నాము