logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హంద్రీనీవా కాలువలో వేలాది చేపలు మృతి సోమందేపల్లి నక్కలగుట్ట కాలనీలో ఘటన.. కాలుష్యంపై స్థానికుల ఆందోళన

సోమందేపల్లి, మే 31 (AIMA MEDIA ): మండలంలోని నక్కలగుట్ట కాలనీ సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువలో వేలాది చేపలు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం స్థానికులు కాలువను పరిశీలించగా నీటిపై చనిపోయిన చేపలు తేలుతూ కనిపించాయి. చిన్న, పెద్ద చేపలతో పాటు ఇతర జలచరాలు కూడా మృతిచెందినట్లు గుర్తించారు.
కాలువలో ప్లాస్టిక్ సంచులు, పూజా వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడంతో పాటు నీరు ముదురు రంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతోంది. కాలుష్యం కారణంగా నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి చేపలు మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
“కాలువే మా జీవనాధారం. ఇలా కలుషితమైతే బతకడం కష్టమే” అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి నీటి నమూనాలు సేకరించి కారణాలు గుర్తించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
మృతిచెందిన చేపలను తొలగించి కాలువ పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

29
1645 views

Comment