logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కర్నూలు మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు

కర్నూలు ( AIMA MEDIA ): మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదేళ్ల బాలుడు యువన్ చంద్ర కూడా ఉన్నారు. పోలీసులు మరియు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం, సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మంత్రాలయంలో హాజరయ్యారు. పూజ అనంతరం ఆరుగురు సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు దిగగా, నీటి లోతు మరియు వేగవంతమైన ప్రవాహం కారణంగా ఐదుగురు గల్లంతయ్యారు. అపర్ణ అనే మహిళ మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారిలో సతీష్ (35), అతని కుమారుడు యువన్ చంద్ర (5), సంధ్య (22), రాఘవేంద్ర (25), ధను (23) ఉంటారు. స్థానికులు మరియు గజ ఈతగాళ్లు రాత్రి పొద్దుపోయే వరకు గాలింపు కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు వారి ఆచూకీ కోసం కృషి చేస్తున్నారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

18
666 views

Comment