ఎర్రుపాలెంలో అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన
ఎర్రుపాలెం మండలంలో గురువారం ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క రూ.30 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న రహదారులు, సబ్స్టేషన్లు, ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజలు చేశారు. తక్కెళ్లపాడు, ఇనగాలి, ములుగుమాడు, గోసవీడు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లకు నిధులు కేటాయించారు. పెద్దగోపవరం, జమలాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్లకు కూడా శంకుస్థాపన చేశారు.