logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డలో A1 న్యూస్ ఏపీ ఛానల్ను ప్రారంభించిన డీఎస్పీ శ్రీనివాసరావు.

AIMA న్యూస్. నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా ‘A1 న్యూస్ ఏపీ’ ప్రాంతీయ వార్తా ఛానెల్‌ను గురువారం రోజున ఆళ్లగడ్డ డి.ఎస్.పి శ్రీనివాసరావు వారి కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ. సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య మీడియా ఒక మంచి వారధిలా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభమైన ‘A1 న్యూస్ ఏపీ’ ఛానెల్ నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ, ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. అనంతరం ఛానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి. వెంకటరమణ మాట్లాడుతూ. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, విలువలతో కూడిన జర్నలిజానికి తమ ఛానెల్ కట్టుబడి ఉంటుందని ఎక్కడా రాజీ పడకుండా ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలను వెలుగులోకి తెస్తామని ఆళ్లగడ్డ ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్త వార్తలను ఎప్పటికప్పుడు వేగంగా, నమ్మకంగా ప్రజలకు అందిస్తామని వివరించారు. తమ ఛానెల్‌ను ఆదరించి, ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఛానెల్ ప్రతినిధులు, నియోజకవర్గ జర్నలిస్టులు,పాల్గొన్నారు.

198
5485 views

Comment