logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డ. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవులపై జనసేన సీనియర్ల అసమ్మతి.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల నియామకం తీవ్ర అసమ్మతికి దారితీసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల ఎంపికపై పార్టీలోని పాత, సీనియర్ జనసేన నాయకులు బహిరంగంగానే తమ నిరసన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి జెండా మోసి, నిరంతరం ప్రజాక్షేత్రంలో పోరాడిన తమను కాదని, నిన్న కాక మొన్న పార్టీలో చేరిన కొత్త వ్యక్తులకు డైరెక్టర్ పదవిని ఎలా కట్టబెడతారని సీనియర్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాత్రింబవళ్లు శ్రమించడం జరిగిందని. పార్టీ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడిన స్థానిక సీనియర్లను విస్మరించి, వలస వచ్చిన వారికి పెద్దపీట వేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో నమ్ముకున్న కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని
ఇప్పటికైనా పార్టీ అధిష్టానం, స్థానిక ముఖ్య నేతలు ఈ నియామకంపై పునరాలోచన చేయాలని. ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న పాత నాయకత్వానికి న్యాయం చేయాలని కోరారు.

189
5126 views

Comment