logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మే నెల 29/30/31-సర్వ సౌభాగ్య దేవిత్రయ యజ్ఞ ఆహ్వానం

శ్రీ సర్వసౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞ
ఆహ్వానం
ప్రియాత్మ బంధువులారా !
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ట పురుషోత్తమ మాసము విష్ణు పురాణం ప్రామాణికంగా యజ్ఞము దానము దేవతా కార్యక్రమాలకు ఎంతో విశేష మైనది
శుక్లపక్ష త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ తేది : 29-05-2026 నుండి తేది : 31-05-2026, వరకు శుక్ర, శని, ఆదివారములు, ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి భక్త జనుల కోరికలు నెరవేర్చుటలో ఆమెకు ఆమెయేసాటి. తనను నమ్మి కొలిచిన భక్తులకు కొంగు బంగారము, ఆ తల్లి ఆపద్భాందవి - ఐశ్వర్య ప్రదాయిని విద్యాదాయిని శ్రీ జగన్మాతను భక్తి శ్రద్ధలతో దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మ అనుగ్రహ పాత్రులైన వారు కోకొల్లలు ఇంతేలా దేవిత్రయ యజ్ఞమును ఆచరించిన భక్తులకు వారి వారి కోరికలు నెరవేర్చుకొనుట భక్తులు అందరికి విదితమే. ఇంతటి మహిమాన్వితమైన శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞాన యజ్ఞమును నిర్వహించుటకు భక్తులు నిర్ణయించినారు.
యజ్ఞ స్థలము శ్రీలక్ష్మి కన్వెన్షన్ ఎ సి హాల్
ఇంద్ర నాగేంద్ర ఎదురుగా కర్మన్ ఘాట్

అద్వర్యులు మురుకుంట్ల రాజేశ్వరశర్మ గారు
(దుర్గాదేవి ఉపాసకులు)
శ్రీ సూరిశెట్టి శ్రీనివాస్ గుప్త శ్రీమతి సత్యవేణి
సూరిశెట్టి సురేష్ గుప్త దివినుండి సంధ్య
సూరిశెట్టి శశిధర్ గుప్త శ్రీమతి స్వాతి గార్ల సమన్వయంతో
ఇట్లు గతయజ్ఞ నిర్వాహకులు
నిస్వార్త స్వహృదయ దాతలు

తేది 29-05-2026, శుక్రవారం
కార్యక్రమ వివరాలు:-
• ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, శ్రీ ఓంకార ప్రణవ పతాకావిష్కరణ, శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, కలశ స్థాపన, అఖండదీపారాధన. రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్కరణము. ఉ॥ 8.30 ని||లకు పంచగవ్యప్రాశనం, విధ్యార్థులకు నాలుకపై బీజాక్షరము వ్రాయుట. మంటపారాధన అభిషేకములు, అర్చనలు, అగ్ని ప్రతిష్టాపన, గణపతి, నవగ్రహ హవనం, మేధాసూక్త, శ్రీ జ్ఞానసరస్వతి మూలమంత్ర హవనం, మహానివేదన, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం.
| సా|| 6.30 ని||లకు శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారికి శ్వేత పుష్పాలతో విశేషార్చన, వేదపారాయణం మహానివేదన రాజోపచారము, మంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం.
తేది 30-05-2026, శనివారం
| |॥ 7.24 ని |॥లకు యాగశాల ప్రవేశం, శ్రీ మహాగణపతి పూజ, మండపాధిష్టిత దేవతా ప్రాతకాల పూజాదులు, శ్రీ ధనలక్ష్మీ దేవి | అమ్మవారికి విశేషాభిషేకము, ఉ॥ 9 గం||లకు శ్రీ గణపతి, శ్రీ సూక్త, పురుషసూక్త శ్రీ ధనలక్ష్మీ దేవి అమ్మవారి మూల మంత్ర హవనములు, మహానివేదన, నీరాజన మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం.
సా || 6.30 ని॥ లకు ప్రదోషకాల పూజ, శ్రీ ధనలక్ష్మీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు, దీపాలంకరణ, వేదపారాయణం, మహానివేదన, మం౧ళహారతి, రాజోపచారములు, తీర్థప్రసాద వినియోగం.
తేది 31-05-2026, ఆదివారం
ఉ |॥ 6.30 ని||లకు యాగశాల ప్రవేశం, శ్రీ మహాగణపతి పూజ, గోపూజ, | మండపాధిష్టాత దేవతా ప్రాతకాల పూజాదులు, మహారుద్రాభిషేకము, బిల్వార్చన, శ్రీ కనక దుర్గ అమ్మవారికి అష్టాదశ ద్రవ్యములతో విశేషాభిషేకము, దుర్గా సహస్రనామ, రుద్రస్వాహకార హోమములు.
ఉ || 11.30 ని|| శ్రీ లక్ష్మీనృసింహా స్వామి కళ్యాణ మహోత్సవము
మ || 12.45 ని|| మహా పూర్ణాహుతి, మహానివేదన, మహా మంగళ హారతి రాజోపచారములు, ఆచార్యపూజ, | మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వినియోగం. గత యజ్ఞ నిర్వహకులకు సహృదయ దాతలకు శేష వస్త్ర, ఫల బహుకరణ. | శ్రీ మహిమాన్విత దైవ కార్యక్రమములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్మాత అనుగ్రహ పాత్రులు కాగలరు. ఈ మూడు రోజులు భగవద్గీత యజ్ఞం జరుపబడును.
భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే పూజ, యజ్ఞ కార్యక్రమములో పాల్గోనగలరు

8
711 views

Comment