logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కులగణనపై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సంఘాల హర్షం

సత్తెనపల్లి పట్టణంలోని ఎన్జీవో హోమ్ సెంటర్‌లో బీసీ సంఘాల నాయకుడు పల్లపు అంకమ్మరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు కులగణనపై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్లుగా దేశాన్ని పరిపాలించిన వివిధ రాజకీయ పార్టీలు కులగణనపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయాయని, అయితే ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం కులాలవారీగా లెక్కింపు జరపాలని తీర్పునివ్వడం శుభపరిణామమని కొనియాడారు. ఈ తీర్పును బీసీలకు మొదటి స్వాతంత్ర్యంగా భావిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కులాలవారీ గణనపై నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గుంటూరు గోవిందు, చింకా అంకమ్మరావు, పిక్కిలి శివ, కుమ్మరి దస్తగిరి, కోరుమట్ల మురళి, ప్రత్తిపాటి హరే కృష్ణ, వీరాటం సైదారావు, షేక్ చిన్న షరీఫ్, పల్లపు ధర్మారావు, కోరబండ్ల మురళి, శివరాత్రి శివ కోటేశ్వరావు, రాజవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

11
977 views

Comment