అంతిమయాత్రలో పాల్గొన్న భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ బుర్ర రమేష్ గౌడ్ గారి తండ్రిగారైన కీ.శే. బుర్ర రాజయ్య గౌడ్ గారి అంతిమయాత్రలో భూపాలపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య గౌడ్ గారు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజయ్య గౌడ్ గారి మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.