logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*45 ఏళ్ల మహిళలు అర్ధరాత్రి బోల్డ్ చాటింగ్.. హైదరాబాద్లో పెరుగుతున్న బ్లాక్మెయిల్ కేసులు.. బాధ్యత మరిచిన ఇల్లాలు!*

*45 ఏళ్ల మహిళలు అర్ధరాత్రి ‘బోల్డ్’ చాటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న బ్లాక్‌మెయిల్ కేసులు.. బాధ్యత మరిచిన ఇల్లాలు!*

ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకున్న స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. కానీ, అదే ఫోన్ కొన్నిసార్లు నిండు సంసారాల్లో చిచ్చు పెడుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబానికి అండగా నిలవాల్సిన విచక్షణను హరించి వేస్తోంది. నగరంలో ఇటీవల వెలుగుచూస్తున్న కొన్ని క్రైమ్ సంఘటనలు, కౌన్సిలింగ్ సెంటర్లకు వస్తున్న కేసులు చూస్తుంటే సమాజం ఎటు వైపు వెళ్తోందనే ఆందోళన కలగక మానదు.
తాజాగా వెలుగులోకి వస్తున్న డిజిటల్ క్రైమ్ మూలాలు పరిశీలిస్తే.. 40 దాటిన కొందరు మహిళలు క్షణికానందం కోసం, 'నా క్వాలిటీ టైమ్' అనే భ్రమలో పడి జీవితాలను ఎలా రోడ్డున పడేసుకుంటున్నారో స్పష్టమవుతోంది.

బాధ్యత మరిచిన అర్ధరాత్రి చాటింగ్‌లు

రాత్రి ఒంటిగంట దాటింది.. ఇంట్లో భర్త తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డాడు. పక్కనే పిల్లలు రేపటి భవిష్యత్తుపై నమ్మకంతో నిద్రపోతున్నారు. ఆ సమయంలో వారికి ధైర్యం చెప్పి, అండగా ఉండాల్సిన 45 ఏళ్ల ఇల్లాలు.. ఫోన్ పట్టుకుని అపరిచితులతో ‘బోల్డ్’, ‘అడల్ట్’ చాటింగ్‌లలో మునిగిపోవడం ఏ రకమైన సంస్కృతి? 45 ఏళ్లు అంటే జీవితంపై పూర్తి అవగాహన రావాల్సిన వయసు. టీనేజ్‌లో ఉన్న పిల్లలకు తల్లి ప్రవర్తనే రోల్ మోడల్. అలాంటిది అర్ధరాత్రి పూట పరాయి వ్యక్తులతో శృంగార సంభాషణలు చేయడం కుటుంబానికే కాదు, ఆమె వ్యక్తిత్వానికీ తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగిన విషయం కాదు.

హైదరాబాద్‌లో నెలకు 10కి పైగా కేసులు!

ఆన్‌లైన్ వేదికగా సాగే బోల్డ్ చాటింగ్‌లు ఎప్పటికీ ప్రైవేట్ కావు అనే కనీస నిజాన్ని సదరు మహిళలు గ్రహించలేకపోతున్నారు. అవతలి వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ కావచ్చు లేదా సైబర్ నేరగాడు కావచ్చు.

స్క్రీన్‌షాట్లు, స్క్రీన్ రికార్డింగ్‌లు: చాటింగ్ సమయంలో షేర్ చేసే ఫొటోలు, వీడియోలు, సంభాషణలు క్షణాల్లో రికార్డ్ అవుతాయి.

బ్లాక్‌మెయిల్ దందా:"మీ భర్తకు చూపిస్తాం, బంధువులకు పంపుతాం" అంటూ లక్షలాది రూపాయలు డిమాండ్ చేసే ముఠాలు నగరంలో పొంచి ఉన్నాయి.

పరువు గాల్లోకి: హైదరాబాద్ నగరంలోనే నెలకు సగటున 10కి పైగా ఇలాంటి బ్లాక్‌మెయిల్ కేసులు సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వస్తున్నాయి. కేవలం రెండు నిమిషాల చాటింగ్ ముచ్చట.. 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన కుటుంబ పరువును బజారున పడేస్తోంది

ఒంటరితనానికి తప్పుడు దారే పరిష్కారమా?

భర్తకు ఆరోగ్యం బాగోలేనప్పుడు భార్య మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు లోనవడం సహజమే. కానీ దానికి పరిష్కారం పరాయి మగవాళ్లతో అర్ధరాత్రి సెక్స్ చాట్ చేయడం కాదు.

సమస్యలు ఉన్నప్పుడు వివేకంతో ఆలోచించాలి. ఒంటరితనం అనిపిస్తే పుస్తకాలు చదవడం, దైవచింతన, స్నేహితులతో మాట్లాడడం లేదా అవసరమైతే సైకాలజిస్ట్‌ను కలిసి కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంతే తప్ప, దారి తప్పి 'నాకు వేరే ఆప్షన్ లేదు' అనడం స్వయంకృత అపరాధమే అవుతుంది." అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనిషిని జంతువు నుంచి వేరు చేసేది విచక్షణే. శారీరక కోరికలు, మానసిక ఒత్తిళ్లు అందరికీ ఉంటాయి. కానీ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థకు, కుటుంబ బంధాలకు కట్టుబడి ఉండడమే నిజమైన సంస్కారం. భర్త నీడలో ఉంటూ, ఆయన తిండి తింటూ, ఆయన నిద్రపోయాక వెనకనుంచి ఇలాంటి ద్రోహానికి ఒడిగట్టడం క్యారెక్టర్‌కే మచ్చ.

పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం

తల్లి రాత్రి పూట మేల్కొని ఫోన్ చూస్తూ నవ్వుతుంటే టీనేజ్ పిల్లలు గమనించకుండా ఉంటారా? తల్లి ప్రవర్తననే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు. రేపు వారు కూడా ఇదే బాట పడితే తప్పు ఎవరిది? ఇల్లు చక్కదిద్దాల్సిన తల్లే తప్పుదారి పడితే ఆ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైపోతుంది.

సానుభూతి కాదు.. సరిదిద్దడం ముఖ్యం!

మారుతున్న సమాజాన్ని సాకుగా చూపి తప్పును ఒప్పు చేయలేం. తప్పు ఎప్పటికీ తప్పే. కష్టాలు వచ్చాయని తప్పుడు దారిని ఎంచుకునే లాజిక్‌ను సమాజం అంగీకరించదు. ఒకవేళ భర్తతో కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే ధైర్యంగా విడాకులు తీసుకుని గౌరవంగా బతకాలి. అంతే కానీ, ఒకే ఇంట్లో ఉంటూ నమ్మకద్రోహానికి పాల్పడడం క్షమార్హం కాదు.
ఇలాంటి ఇల్లాళ్లు ఇకనైనా ఫోన్ పక్కన పెట్టి.. మంచాన ఉన్న భర్తకు మందు ఇచ్చి, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడమే సంస్కారం. సైబర్ ముఠాల చేతిలో చిక్కి జీవితాలను నాశనం చేసుకోకముందే విచక్షణతో వ్యవహరించడం ఎంతో అవసరం.

0
24 views

Comment