logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Nine varieties of seeds distributed by bobbili mla to Farmers

బొబ్బిలి ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "నవధాన్యాల సాగు" కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశాను.. భూములు సారవంతంగా ఉండేందుకు 20 నుంచి 30 రకాల విత్తనాల మిశ్రమం గల నవధాన్యాలను ఎకరానికి 15 నుంచి 25 కేజీలను వేసుకోవాలని సూచించాను..ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా గతంలో 10కేజీల బరువు గల మిశ్రమాన్ని ఇచ్చేవారు, ఇప్పుడు 15కేజీల మిశ్రమం ఇస్తున్నాము.. భూసారం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారికి నేను కూడా కొన్ని సూచనలు చేస్తున్నాను.. పూర్తిగా రసాయన ఎరువులకు అలవాటుపడిన మన భూములను నెమ్మదిగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పూర్వ సారాన్ని పునరుద్ధరించేలా ప్రణాళికలు చేస్తున్నాము, తద్వారా క్యాన్సర్ వంటి రోగాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నాము.

అలాగే, భూసారాన్ని పెంచడానికి మరియు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి నవధాన్యాల సాగు (పచ్చిరొట్ట ఎరువు) అత్యంత శ్రేయస్కరము, తొలకరి వర్షాలకు ముందు లేదా రెండు పంటల మధ్య కాలంలో వీటిని సాగు చేస్తాము..దీనివల్ల మట్టికి సహజ నత్రజని, పోషకాలు అందుతాయి, వేసవిలో లేదా రెండు ప్రధాన పంటల మధ్యలో ఖాళీగా ఉన్న సమయంలో వీటిని విత్తుకోవాలి..ఈ పంటలు వేగంగా పెరిగి నేలకి అవసరమైన సేంద్రీయ కర్బనాన్ని అందిస్తాయి, పంట పూత దశకు రాగానే (విత్తనాలు పడకముందే) వీటిని భూమిలో కలియదున్నాలి, వీటి వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోయి గాలిలోని నత్రజనిని నేలలో స్థిరీకరిస్తాయి..భూమిని నమ్ముకునే రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

8
5174 views

Comment