వస్తాద్ శీను యాదవ్ పైల్వాన్కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా సన్మానం
హైదరాబాదులో జరిగినటువంటి వస్తాద్ ఖలీఫా దావత్ కార్యక్రమానికి వస్తాద్ శీను యాదవ్ పైల్వాన్ గారి ఆహ్వానం మేరకు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ మరియు వారి తండ్రిగారు, ప్రముఖ యాదవ సంఘం శ్రేయోభిలాషి అయిన చిన్న శ్రీశైలం యాదవ్ గారిచే సన్మానాన్ని అందుకోవడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో కేవలం హైదరాబాదు మహానగరంలో మాత్రమే జరుగుతున్నటువంటి కుస్తీ పోటీలు గానీ, మల్ల యుద్ధం పోటీలు గాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ పైల్వాన్ కు ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహా సంఘం జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పి. లక్ష్మి ప్రసాద్ యాదవ్ ఘనంగా సన్మానించారు.