పొట్టి శ్రీరాములు పార్క్లో ఘనంగా జొన్నలగడ్డ రితీష్ కుమార్ జన్మదిన వేడుకలు
పొట్టి శ్రీరాములు పార్క్ ఫ్రెండ్స్ అసోసియేషన్, కర్ర సాము శిక్షణ కేంద్రంలో మంగళవారం పట్టణానికి చెందిన జొన్నలగడ్డ రితీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిల్లల వైద్యులు డాక్టర్ యెక్కల సుధాకర్ రావు, యెల్లినేడి వెంకటేశ్వరరావు (బీడీయర్) హాజరుకాగా, ప్రముఖ న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ సత్తెనపల్లి సంఘ్ చాలక్ చలువాది చిన్న సత్యనారాయణ బెంగళూరు నుంచి రితీష్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు కోటగిరి పోతులూరయ్య మాట్లాడగా, పెన్షనర్ అసోసియేషన్ సత్తెనపల్లి అధ్యక్షులు జక్కుల లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య నాయకులు పెరుమాళ్ళ శివన్నారాయణ, ఏజిపి బత్తుల ఆదినారాయణ, న్యాయవాదులు పూజల వెంకట కోటయ్య, జొన్నలగడ్డ విజయ్ కుమార్, రాజవరపు శివనాగేశ్వరరావు, గంగూరి వెంకట్రావ్, వర్తక వ్యాపారి త్రిపురమల్లు రవి, డాక్టర్ యెల్లినేడి రామారావు, దుడుకు కోటేశ్వరరావు, లింగిశెట్టి వెంకట కృష్ణ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.