తెలంగాణలో ఎండలు.. ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ
జర్నలిస్ట్: ఆకుల గణేష్
TG: రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్రమైన ఎండలతో అల్లాడుతోంది. రాష్ట్రం మొత్తం హీట్ కోర్ జోన్‌గా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేశారు. రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా, మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు