logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైదరాబాద్: 8వ కేంద్ర వేతన సవరణ సంఘంతో ప్రధాన సంఘాల చర్చలు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నియమించిన 8వ కేంద్ర వేతన సవరణ సంఘం వివిధ సంఘాల ప్రతినిధులతో చర్చలు నిర్వహించింది. సీసీజీజీఓఓ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా), ఎన్సీసీపీఏ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కనీస వేతనం రూ. 69,000 చెల్లించాలని, వేతన సవరణ ఫిట్మెంట్ 3.833గా ఉండాలని డిమాండ్లు ప్రతిపాదించారు.

ఇకపెన్షన్ల రివిజన్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం అమలుపై, ఎన్పీఎస్/యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత డిఫైండ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఇంటి అద్దె సహాయం, రైల్వే రాయితీలు పునరుద్ధరణ, సూపర్ సీనియర్ సిటిజన్లకు కేర్ టేకర్ అలవెన్స్ వంటి అంశాలపై సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్, సీ.హెచ్. శ్రీనివాస్ రావు, టాప్రా నాయకులు రామచంద్రుడు, పి.ప్రభాకర్, జి. అశోక్, యం. అర్జున్, ఎన్సీసీపీఏ నాయకులు ఎన్. సోమయ్య, వై. రాజశేఖర రెడ్డి, రైల్వే నాయకులు శ్రీధర్, కె. శివకుమార్, కాన్ఫెడరేషన్ నాగేశ్వరరావు, అజీజ్, డిఫెన్స్ అజయ్, శ్రీకాంత్ గౌడ్, రషీద్ అలీ తదితరులు చర్చించారు.

4
611 views

Comment