హల్దీ వేడుకలో విషాదం.. పెళ్లి కూతురు మృతి
హల్దీ వేడుకలో విషాదం.. పెళ్లి కూతురు మృతి
మధ్యప్రదేశ్ లోని ఖనోర్ జిల్లాలో, కస్రావాడ్ గ్రామంలో పెళ్లికి ముందు హల్దీ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. అతిథులు పసుపుతో పాటు పర్ఫ్యూమ్ కలిపి పూయడంతో పెళ్లి కూతురు రాఖీ(21) తీవ్ర అలెర్జీతో గొంతు వాచి, పెదవులు ఉబ్బి, శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్పించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే యువతి మృతి చెందింది. అధికారులు విచారణకు ఆదేశించి, పసుపు, పర్ఫ్యూమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు.