చిత్తూరు జిల్లా: మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు - ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక
చిత్తూరు జిల్లా: జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS గారు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు, మాదక ద్రవ్యాలు యువత జీవితాలను చీకటిలోకి నెట్టివేస్తున్నాయని, డ్రగ్స్ వాడకంతో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, నేరాలకు దారితీస్తోందని హెచ్చరించారు. NDPS చట్టం ప్రకారం అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొనే దందాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తుషార్ డూడి యువతకు గంజాయి వ్యసనం జీవితాన్ని నాశనం చేసే విషం అని సూచించి, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని, విద్యాసంస్థలు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. సైబర్ విభాగం సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు పై ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రజల సహకారం ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.