రోలుగుంట: ప్రభుత్వం పాఠశాలల స్పెషల్ అడ్మిషన్స్ డ్రైవ్ నిర్వహణ
రోలుగుంట: 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేరికలను పెంపొందించేందుకు రోలుగుంట పంచాయతీలో “అడ్మిషన్స్ స్పెషల్ డ్రైవ్” కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ.వీ. శేషగిరిరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం నిర్వహించి, గ్రామంలో పర్యటిస్తూ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యా సదుపాయాలపై అవగాహన కల్పించారు. ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి, హిందీ ఉపాధ్యాయిని రెహనా బేగం, లెక్కల ఉపాధ్యాయిని ధనలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు సోమరాజు, విజయరాణి మరియు దుర్గలక్ష్మి పాల్గొని “ప్రైవేట్ పాఠశాలలు వద్దు – ప్రభుత్వ పాఠశాల ముద్దు” అనే నినాదంతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, డిజిటల్ బోధనకు IFP ప్యానెల్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు, పాల్ ల్యాబ్ సౌకర్యాలు వంటి అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు మరియు ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ వేదికలని, నాణ్యమైన విద్యతో విలువల బోధన అందిస్తున్నామని తెలిపారు.