వేలాంగిణి మాత దర్శన యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ కార్యాలయం నుండి తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నాగపట్నం వేలాంగిణి మేరీ మాత దర్శనార్థం బయలుదేరిన క్రైస్తవ సోదరుల యాత్రను తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు సంబంధించి పూర్తి స్వయం సహకారాలు అందించిన కన్నా లక్ష్మీనారాయణ గారికి క్రైస్తవ సోదరులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ మరియు వార్డు స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు