logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇల్లంతకుంటలో ఉచిత RO ప్లాంట్ ప్రారంభోత్సవం

సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం : 15/05/2026 : ఇల్లంతకుంట కేంద్రంలోని వొగ్గు నర్సయ్య ఫిల్లింగ్ స్టేషన్‌లో ఉచిత మినరల్ వాటర్ (RO ప్లాంట్) ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపల్లె సర్పంచ్ నవీన్ రెడ్డి, జంగంరెడ్డిపల్లి సర్పంచ్ సునీత తిరుపతి, గొల్లపల్లి సర్పంచ్ రాడం లక్ష్మి ప్రవీణ్, ఉప సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు పత్రి అంజయ్య, మ్యాక శ్రీనివాస్, బైరి శ్రీనివాస్, శంకర్ మరియు ఇతర స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంక్ యాజమాన్యం తాము పరిసర ప్రాంతాల ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీటిని ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు శుద్ధమైన నీరు అందించడంలో మంచి సహకారం కచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

8
1165 views

Comment