logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎరువుల ధరలు పెంచవద్దు. రైతులపై భారాలు వేయవద్దు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.

నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ సమావేశానికి హాజరైన రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి .రామచంద్రుడు రైతులతో కలిసి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను కొరత లేకుండా పాత ధరకే సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు. యుద్ధం పేరుతో కంపెనీలు ఎరువులు ధరలు పెంచడాన్ని. రైతు సంఘంగా ఖండిస్తున్నామని, యుద్ధం వల్ల ఉత్పత్తి ఖర్చులు విపరీతంగాపెరిగితే కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీలు ఇవ్వాలి తప్ప ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వటం రైతులను ముంచడమే అవుతుంది అన్నారు. ఒక్కొక్క బస్తా పై125 రూపాయల నుండి 300 రూపాయలు వరకు ధరలు పెంచారని, మన జిల్లాలో అత్యధికంగా రైతాంగం వాడే కాంప్లెక్స్ ఎరువు 20 .20 .0 .13 పై ఒకేసారి 300 రూపాయలు పెంచడం వల్ల ప్రస్తుతం ధర1800 రూపాయలు అవుతుందని,10.10.26, 12.32.16, 14.35.14, 19.19.19 బస్తాలపై ఒకేసారి 225 రూపాయలు పెంచడం వల్ల వాటి ధరలు ప్రస్తుతం,2250 ,2250 ,2400,2300 రూపాయలు అవుతాయని,
పొటాష్ పై 125 రూ పెంచడం వల్ల 1975 రూపాయలకు ధర చేరిందన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల రాబోవు ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం చేయడం ఇబ్బందిగా మారుతుంది. రైతులకు అవుతుంది అన్నారు. ఇప్పటికే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అంటూ సకాలంలో ఎరువులు దొరకక అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో కొనలేక, విపరీతమైన పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు. గోరుచుట్టు పై రోకలి పోటు అన్న చందంగా మళ్లీ ఎరువుల ధరలు పెంచి మోడీ రైతుల నడ్డి విరిచి వేస్తున్నాడు. తమ ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు అమలు, కొనుగోలు కేంద్రాలు పెట్టడంలో శ్రద్ధ చూపని ప్రభుత్వాలు ఒక్కసారిగా ఎరువుల ధరలు పెంచడం రైతుల్ని పాతాళంలోకి తొక్కే విధంగా ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టి సకాలంలో రైతాంగానికి అవసరమైన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అందుకు రైతులందరూ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలని, అందుకోసమే రైతులందరూ సంఘటితనం కావాలని, తమ రైతు సంఘంలో సభ్యులుగా చేరాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 2400మొక్కజొన్న మద్దతు ధర అమలు జరగక కేవలం క్వింట 1500 నుండి1600 మాత్రమే అమ్ముకొని నష్టపోతుంటే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు,ముఖ్యమంత్రి గారు గుడ్లప్పగించి చూడడం , కేంద్రంపై కుంటి సాకులు చెప్పడం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్కచోట కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. అరకొర ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అనేక రకాల షరతులు విధించి వాస్తవ రైతాంగానికి మోసం చేస్తున్నారు. అధికార పార్టీ అనునాయులకు అనుకూలంగావ్యవహరిస్తున్నారు. వరి పంట కొనుగోలు కేంద్రాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలకు ఇవ్వకుండా, కేవలం కోస్తా ప్రాంత రైతులకే అమలు జరుపుతూ మన ప్రాంత రైతులకు మోసం చేస్తున్నారు. మన ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కావున రైతాంగం సంఘటితంగా ఉద్యమించాలని, మద్దతు ధరల అమలు కోసం, పెరిగిన ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రుద్రవరం మండల అధ్యక్షుడు టి. గురెడ్డి, జిల్లా నాయకులు జి .శంకరయ్య, మండల నాయకులు మద్దిలేటి, చంద్ర, దస్తగిరి, అబ్దుల్లా, బాల నరసింహుడ తతదితరులు పాల్గొన్నారు.

4
303 views

Comment