logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూతన వధూవరులను ఆశీర్వదించిన BSDP జిల్లా అధ్యక్షులు బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

భూపాలపల్లి, మే 13: ఇల్లందు క్లబ్, భూపాలపల్లిలో ఘనంగా నిర్వహించిన బుర్ర అశోక్ సాయి ప్రసన్నల వివాహ మహోత్సవంలో భారత్ సమాజ్ డెవలప్ పార్టీ (BSDP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమ, విశ్వాసం, అవగాహనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.
వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆత్మీయ వాతావరణంలో వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది.

16
1240 views

Comment