logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డలో క్రేన్ల బీభత్సంపై పోలీసుల ఉక్కుపాదం..

AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ పట్టణంలోని శిల్పకళా కారుల యజమానులు, క్రేన్ డ్రైవర్లు మరియు క్లీనర్లతో పట్టణ సీఐ నాగరాజ రావు బుధవారం నాడు టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణంలో క్రేన్ల రాకపోకల వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల నివారణపై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని నంద్యాల రోడ్డులో దాదాపు 35 క్రేన్లు నిత్యం ఇష్టానుసారంగా పెద్ద పెద్ద రాళ్లను లోడ్ చేసుకొని రోడ్లపైకి క్రేన్లు రావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మాత్రమే క్రేన్లను ఆపరేట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గతంలో క్రేన్ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా మరణించిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయం దాటిన తర్వాత రోడ్లపైకి క్రేన్లను తీసుకువస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు, యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజ రావు హెచ్చరించారు.ఈ సమావేశంలో పట్టణ పోలీస్ సిబ్బందితో పాటు పలువురు శిల్పకళా కేంద్రాల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

275
6721 views

Comment