logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..

పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని మతోన్మాద సంస్థలు మాజీ సీఎం మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఢాకా వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు.ఇక బెంగాల్లోని అక్రమ బంగ్లాదేశీయులు, బంగ్లాదేశ్కు వస్తే శరణార్థి సమస్య ఎదురవుతుందని ఆ దేశానికి చెందిన పార్లమెంట్ ఎంపీ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద భావాలు ఉన్న మత గురువు మౌలానా ఎనాయతుల్లా అబ్బాసి భారతదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు సురక్షితంగా లేకపోతే, బంగ్లాదేశ్లోని హిందువులు కూడా సురక్షితంగా ఉండనివ్వబోమని హెచ్చరించారు. ఇతడిని గతంలో కూడా భారత్పై విద్వేష వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. 2023లో మదర్సాలకు ఆయుధాలు ఇచ్చి వాటిని సైనిక స్థావరాలుగా మార్చాలని చెప్పాడు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ ముస్లింలు న్యూఢిల్లీపై ఇస్లామిక్ జెండాను ఎగురవేస్తాయని ప్రగల్భాలు పిలికాడు.

మౌలానా ఇనాయతుల్లా అబ్బాసీ మాట్లాడుతూ.. భారతదేశంలోని హిందువులు ముస్లింలను అణిచివేస్తున్నారని, బీఫ్ విక్రయించే దుకాణాల కూల్చివేత, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్ భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని కోరారు. అలాగే భారత్పై దౌత్య, రాజకీయ ఒత్తిడిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు.

0
57 views
1 shares

Comment