స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల నిరసన
ఎస్. బి.ఐ.సమస్యలపై ఆల్ ఇండియా స్టాప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను విజయనగరం మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ వద్ద విజయనగరం జోనల్ సెక్రెటరీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జోనల్ ఆఫీసర్ ఎం రమేష్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రధాన డిమాండ్లను యాజమాన్యం తక్షణమే నెరవేర్చాలని కోరారు. అందులో మొదటి డిమాండ్ మెసెంజర్లు, ఆయుధ భద్రత గార్డులు బ్యాంకు లో వున్న ఖాళీ లను వెంటనే భర్తీ చేసి అన్ని శాఖల, కార్యాలయాల్లో తగిన సిబ్బంది నియమించాలి.
పెన్షన్ ఫండ్ మేనేజర్ ను మార్చుకొని అవకాశం,అన్ని వేతన భాగాలను పెన్షన్ లో చేర్చాలని,
ఉద్యోగుల కు తమ పెన్షన్ ఫండ్ మేనేజర్ ను పీఎఫ్ ఏం ను మార్చుకునే అవకాశం ఇవ్వండి అని,పెన్షన్ లెక్కింపులో అన్ని అర్హత గల వేతన భాగాలను చేర్చాలన,4. 2019 తర్వాత చేరిన ఉద్యోగులకు ఇంటర్- సర్కిల్ బదిలీలు చేయాలని 2019 తర్వాత నియమూర్తులైన ఉద్యోగులకు కూడా ఇతర ఉద్యోగాలు మాదిరిగా ఇంటర్ సర్కిల్ సౌకర్యం కల్పించాలని,
వేతనాలు పదోన్నతులు సేవా భీమాలలో ఎస్బిఐ ఉద్యోగాలతో సమానత్వం కల్పించాలని, ప్రస్తుత కెరియర్ ప్రోగ్రెస్ స్క్రీన్ సమీక్ష మెరుగుపరచాలని,
నోషనల్ 8వ స్థాగ్రేషన్ ఇంక్రిమెంట్, మంజూరు చేయాలని,వైద్యుల కన్సిలేషన్ చార్జీలు రియంబర్స్మెంట్ పరిమితులు పెంచాలని,ఉద్యోగుల, పెన్షనర్ల కు మెరుగైన వైద్య రియంబర్స్మెంట్ కల్పించాలని,
వర్క్ మెన్ ఎంప్లాయ్ డైరెక్టర్ , పీఎఫ్ ట్రస్ట్ నామిని నియామకం జరగాలని,వర్క్ మ్యాన్ ఎంప్లాయ్ డైరెక్టర్,పీఎఫ్ ట్రస్ట్ నామిని నియామకం జరగాలని ఈ డిమాండ్ల ను యాజమాన్యం తక్షణమే నెరవేర్చాలని కోరారు. సమస్యలపై స్పందన లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 25,26, తేదీలలో అఖిల భారత స్థాయి బ్యాంకు సమ్మెకు వెళ్తామని తెలిపారు.2019 తరువాత నియమితులైన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ సౌకర్యం కల్పించాలన్నారు. తాత్కాలిక ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. హెచ్ ఆర్ ఎం ఎస్ వ్యవస్థలోని సమస్యలు పరిష్కరించాలని, క్రాస్ సెల్లింగ్, ఒత్తిడి లను తగ్గించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో విజయన రీజనల్ అవార్డు స్టాప్, మెసెంజర్లు, ఆర్మీడ్ గాడ్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ జోనల్ సెక్రెటరీ ఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు.