ఖమ్మం: భట్టి విక్రమార్క పై రేణుకా చౌదరి విమర్శలు, పార్టీ లో విభేదాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నామినేటెడ్ పదవుల విషయంలో తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారని రేణుకా చౌదరి వర్గం ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాణాలు పోసి పార్టీ గెలుపు కోసం శ్రమించిన నాయకులు పదవులు పొందకపోవడంతో రేణుకా చౌదరి అసంతృప్త నేతలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా పరిస్థులను చర్చించారు. ఆమె పార్టీ సీనియర్లకు గౌరవం లేకపోవడం పై ఆవేదన వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా, రేణుకా చౌదరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసి, సమన్వయం లేకుండా జరిగే నామినేటెడ్ పదవుల పంపిణీ కారణంగా కేడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్లుతున్నాయని పేర్కొంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే ఆందోళన ఉంది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని గమనిస్తున్నారు.