జగిత్యాల: ఆర్టీఐ అవగాహన సదస్సు ఏర్పాటు కోరటం
జగిత్యాల జిల్లా: ఈ నెల 16న జగిత్యాలకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ రాబోతున్న నేపథ్యంలో సీనియర్ ఆర్టీఐ కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆర్టీఐ చట్టం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆర్టీఐ కార్యకర్తల రెండో అప్పీల్ కేసులపై విచారణ చేపడుతున్నట్లు దరఖాస్తుదారులకు నోటీసులు పంపినట్లు తెలిపారు.
చుక్క గంగారెడ్డి చెప్పారు, జగిత్యాల జిల్లా లో అనేక శాఖల కార్యాలయాల్లో వేలాదిగా ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు, అవి పరిష్కరించేందుకు అధికారులు, కార్యకర్తలకు సంయుక్తంగా సమాచార హక్కు చట్టం - 2005 పై అవగాహన సదస్సు నిర్వహించాలని కోరారు. కొంతమంది అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆర్థిక నష్టాలు, బాధ్యతా రాహిత్యం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ఉల్లంఘనలకు సంబంధించి శిక్షలు, జరిమానాలు, షోకాజ్ నోటీసులు వంటి విషయాలపై అవగాహన పెంచడం అవసరమని, సీనియర్ ఆర్టీఐ కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పించాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు.