నంద్యాల: జనసేన జిల్లా అధ్యక్ష పదవికి ఇరిగెల రాంపుల్లారెడ్డి పేరు ముందున్నారా?
AIMA న్యూస్ బ్యూరో..నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపైనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయగల సమర్థుడైన నాయకుడి కోసం అధిష్టానం అన్వేషిస్తున్న వేళ, ఆళ్లగడ్డ నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీపై ఇరిగెల రాంపుల్లారెడ్డి కి ఉన్న అంకితభావానికి సభ్యత్వ నమోదు ప్రక్రియే ఒక నిదర్శనం. వరుసగా రెండు దఫాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే జనసేన సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలబడటంలో వీరి పాత్ర అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో వేలాది మందిని జనసేన జెండా కిందకు చేర్చి, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను ఆయన చాటుకున్నారు. ఈ గణాంకాలే ఆయనకు జిల్లా స్థాయిలో పట్టు ఎంతుందో స్పష్టం చేస్తున్నాయి. సామాన్య కార్యకర్తకు కొండంత అండగా నిలబడటమే కాకుండా, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయగల సత్తా ఉన్న నాయకుడిగా ఆయనకు జిల్లావ్యాప్తంగా గుర్తింపు ఉంది.ముఖ్యంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి సామాన్య ప్రజలతో మమేకమయ్యే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెవెన్యూ సమస్యలైనా, పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగకపోయినా. బాధితుల పక్షాన నిలబడి అధికారులతో నేరుగా మాట్లాడి పనులు చేయించడంలో ఆయన శైలే వేరు. మా వెనుక ఇరిగెల సోదరులు ఉన్నారు అనే ధైర్యం నేడు ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో కార్యకర్తలకు కొండంత భరోసాను ఇస్తోంది.రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో కీలకం. ఐదుగురు అన్నదమ్ములు ఒకే తాటిపై నిలబడి కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్తతోనూ వీరికి ఉన్న వ్యక్తిగత సంబంధాలు పార్టీకి పెద్ద ఎసెట్ కానున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గెలుపులో ఇరిగెల కేడర్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బలమైన సామాజిక వర్గం మద్దతుతో పాటు, ఆర్థికంగా కూడా పార్టీని నడిపించగల సత్తా ఉండటంతో ఇరిగెల రాంపుల్లారెడ్డి కి జిల్లా పగ్గాలు దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి, నిబద్ధతతో పనిచేసే ఇలాంటి నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే నంద్యాల జిల్లాలో జనసేన పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని క్షేత్రస్థాయి కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఒకవేళ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటే, నంద్యాల జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. కార్యకర్తల ఆకాంక్షలు నెరవేరుతాయా? ఇరిగెల రాంపుల్లారెడ్డి కి జిల్లా బాధ్యతలు అందుతాయా? అనేది తెలియాలంటే జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.