logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దాసరిరాజు అజయ్ కుమార్ తెలంగాణ వాషర్మెన్ చైర్మన్ గా నియామకం

హైదరాబాద్: దాసరిరాజు అజయ్ కుమార్ గారు తెలంగాణ వాషర్మెన్ కార్పొరేషన్ కోపరేటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంట్ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ శ్రీ రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ మరియు ఇతర మంత్రి వర్యులు, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, పి విశ్వనాథన్, మన్సూరి అలీ, రోహిత్ చౌదరి, సచిన్ సావంత్, వివిధ ఎమ్మెల్యేల, ఎంపీల, ఎంఎల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దాసరిరాజు అజయ్ కుమార్ గారు తనపై నమ్మకం ఉంచి వాషర్మెన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రజకుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

8
1565 views

Comment