నెల్లూరు సిటీ 16వ డివిజన్ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు
నెల్లూరు సిటీ: 16వ డివిజన్ అభివృద్ధి కోసం కూటమి కార్పొరేషన్ డివిజన్ అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల తమ సన్నిహిత కుటుంబాలతో కలిసి పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని డిప్యూటి సిఎం రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని మరియు ప్రజల ప్రాధాన్యతను బలపరిచినట్లు తెలిపారు. మినిస్టర్, సిటీ ఎమ్యెల్యే పొంగూరు నారాయణ దూరదృష్టి వల్ల 16వ డివిజన్ ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందిన ప్రాంతమైంది అని కొనియాడారు. ఆయన సూచించిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలను కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వీరమహిళ నందిని, ఆమని, బ్లూ బర్డ్ సంస్థల యజమాని వేముల శివకృష్ణ, జనసేన నాయకులు హర్ష, వీల్స్ ఆన్ ఐ ప్రతినిధి చిత్తూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.